
సూపర్ స్టార్ మహేష్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ అయితే సర్కారు వారి పాట రికార్డులు తిరగరాయడం పక్కా అంటూ అప్పుడే హడావుడి మొదలుపెట్టారు. లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఎక్కడివి అక్కడే ఆగిపోగా త్వరలోనే షూటింగ్స్ కు అనుమతి ఇచ్చేలా ఆర్డర్స్ వస్తాయని తెలుస్తుంది.
తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే సినిమా పరిశ్రమ సమస్యలకు సానుకూలంగా స్పందించగా త్వరలోనే ఎపి సీఎం వైఎస్ జగన్ ను కలిసి సినీ పెద్దలు చర్చలు జరుపనున్నారు. ఈ నెల చివర నుండి షూటింగ్ మొదలు పెట్టొచ్చని తెలుస్తుండగా.. సర్కారి వారి పాట సినిమాను మాత్రం సెప్టెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీ పేరు వినపడుతుండగా.. లేటెస్ట్ గా ఆమె ప్లేస్ లో సయీ మంజ్రేకర్ ను మహేష్ కోసం ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.