
జయలలిత జీవిత కథతో తమిళంలో తెరకెక్కిన సినిమా తలైవి. ఈ సినిమాను ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ నటించింది. భారీ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా అసలైతే థియేటర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ, కరోనా వల్ల థియేటర్స్ లాక్ డౌన్ చేయడంతో రిలీజ్ పడ్డది. అందుకే ఈ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ రెండు ఓటిటి సంస్థల నుండి ఈ సినిమాకు భారీ డీల్ వచ్చిందట. ఫైనల్ గా 55 కోట్లకు ఈ సినిమాను అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసిన సినిమాల్లో ఇదే భారీ సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయడంపై ఆ సినిమాలో నటించిన కంగనా రనౌత్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. జూన్ 26న తలైవి సినిమా ఓటిటిలో రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు.