ఎన్టీఆర్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్

స్టార్ హీరో బర్త్ డే అంటే ఆ హీరో నటిస్తున్న సినిమా నుండి ఫస్ట్ లుక్ గాని.. టీజర్ గాని రిలీజ్ చేయడం కామన్. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు ఎన్టీఆర్ అయితే మే 20 అనగా రేపు పుట్టినరోజు సందర్భంగా ట్రిపుల్ ఆర్ నుండి ఎన్టీఆర్ టీజర్ వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే వారికి షాక్ ఇస్తూ తారక్ బర్త్ డే కి ఎలాంటి టీజర్ రావట్లేదని వెళ్లడించారు. దీనిపై ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ కు స్పెషల్ గా ఒక లెటర్ రిలీజ్ చేశాడు. 

ఇదిలాఉంటే ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తారక్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేశాడు. సిక్స్ ప్యాక్ తో ఉన్న ఎన్టీఆర్ పిక్ ను తన సోషల్ బ్లాగ్స్ లో షేర్ చేస్తూ ఎవరు ఇప్పటివరకు చూడని తారక్ ఫోటోని షేర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని.. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇలా ఆయన ట్వీట్ చేసి ఫోటో షేర్ చేశారో లేదో నందమూరి ఫ్యాన్స్ ఆ పిక్ షేర్ చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు ట్విట్టర్ లో #HappyBirthdayNTR అంటూ 15 మిలియన్ ట్వీట్స్ తో రికార్డ్ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే 5 మిలియన్ ట్వీట్స్ దాటినట్టు తెలుస్తుంది. మొత్తానికి బర్త్ డే నాడు రాజమౌళి ఇవ్వాల్సిన గిఫ్ట్ మిస్సయినా ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఇచ్చిన కానుకని ఎంజాయ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.