ఇక మీదట అలాంటి వేడుకలు ఉండవా..?

కరోనా ప్రభావం సినీ పరిశ్రమ మీద భారీగా పడ్డదని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యి వెయిట్ చేస్తుండగా.. మరికొన్ని  సినిమాలు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని షెడ్యూల్ డిస్టబెన్స్ లో ఉన్నాయి. ఇక ఇదిలాఉంటే థియేటర్ల ఓపెనింగ్ ఇప్పుడప్పుడే జరిగేలా లేదని పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది. అంతేకాదు మరో ఆరు నెలల పాటు ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి టైం లో స్టార్ సినిమా రిలీజ్ అనగానే ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి వేలకొద్దీ అభిమానులను పోగేసే ఛాన్స్ కూడా లేదని చెప్పొచ్చు.    

కొన్నాళ్లుగా ఈ ఈవెంట్ లకు ఫుల్ స్టాప్ పెట్టక తప్పదని తెలుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాల ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థియేటర్స్ ఓపెన్ చేసినా సరే పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అవడమే కాదు ఇలా ఈవెంట్స్ కు కరోనా ప్రభావం పడేలా ఉంది. అందుకే కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఓటిటి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.