ఓటిటికి రామ్ వ్యతిరేకమా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా రెడ్. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఆల్రెడీ కిషోర్ తిరుమల డైరక్షన్ లో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న రామ్ ఈసారి రెడ్ అంటూ మాస్ ఆడియెన్స్ ను మెప్పించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. 

లాక్ డౌన్ వల్ల థియేటర్స్ మూతబడగా రెడ్ సినిమా కూడా ఓటిటిలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా సరే రెడ్ కచ్చితంగా ఓటిటిలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే దీనిపై లేటెస్ట్ గా రామ్ సినిమా అనేది కొందరికి ఫ్యాషన్.. చాలామందికి వ్యాపారం.. మిగిలిన వారికి జూదం.. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారంటూ ట్వీట్ చేశాడు. #ఓటిటి #థియేట్రికల్ అంటూ పోస్ట్ చేశాడు రామ్. రామ్ ట్వీట్ చేసిన విధానం చూస్తే రెడ్ కూడా ఓటిటి చర్చలు జరుగుతున్నట్టు ఉన్నాయి అందుకే రామ్ ఓటిటి, థియేట్రికల్ అంటూ కన్ ఫ్యూజన్ లో ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని అంటున్నారు.