
ఈరోజు నాధూరాం గాడ్సే పుట్టినరోజు.. అయితే ఆయన నిజమైన దేశభక్తుడు గాంధీ చంపడం కరెక్టా కాదా అన్నది డిబేటేబుల్.. కానీ అతని వైపు ఆర్గుమెంట్ ని అప్పట్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా మొత్తం అధికార ప్రభుత్వానికి లోబడి ఉంది. ఈరోజుల్లో కూడా చాలా వరకు ఇంతే.. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా సరే గాడ్సే అనుకున్నది చేశాడు. అలా అని నాధూరాం దేశభక్తిని శంకించలేము ఆయన ఒక నిజమైన దేశభక్తుడు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకసారి ఆయన్ను గుర్తుచేసుకోవాలనిపించింది.. పాపం నాధూరాం గాడ్సే.. మీ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ మెగా బ్రదర్ మెసేజ్ పెట్టారు. గాడ్సే చివరి మాట అంటూ ఒక లింక్ కూడా పెట్టాడు నాగబాబు.
ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ..contd pic.twitter.com/WNIpG6gsVO
నాగబాబు ట్వీట్స్ కు మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం వల్లే మీ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం తగ్గుతుందని కొందరు. నాగబాబుతో కూడా ఆర్జీవీ దూరాడని మరికొందరు ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే నువ్వు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్లే జనసేన సిద్దాంతం జనాల్లోకి వెళ్లలేదని జనసైనికులే నాగబాబుని ఆడేసుకుంటున్నాడు. ఏది ఏమైనా సడెన్ గా నాగబాబు ఈ రకమైన కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏంటో తర్వాత తెలుస్తుంది.
ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.