
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది. బన్నీ లేకుండానే కేరళ అడవుల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాడు సుకుమార్.
కరోనా ప్రభావంతో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం సినిమా షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. అందుకే కేరళ లో షూటింగ్ చేసిన రష్ అంతా కూడా డిలీట్ చేస్తున్నారట. సుక్కు, బన్నీ బాగా డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి షెడ్యూల్ కోసం 3 కోట్ల దాకా ఖర్చు పెట్టించాడు సుకుమార్. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తున్నారట. కేరళ బదులుగా ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. కరోనా వల్ల సినిమా పరిశ్రమ మొత్తంతో పాటుగా పుష్ప సినిమాకు బాగా ఎఫెక్ట్ పడ్డదని చెప్పొచ్చు.