ఇన్ స్టాగ్రామ్ నుండి ఎగ్జిట్

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ తన ఓరు ఆధార్ లవ్ ఒక్క టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాను తెలుగులో డబ్ చేసి అల్లు అర్జున్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి మరి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ సినిమా ఫలితం నిరాశపరచినా ప్రియా ప్రకాష్ కు తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ వెంటనే స్టార్ ఛాన్సులు వస్తాయని అనుకున్నా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్న ప్రియా ప్రకాష్ మహేష్ మూవీలో ఛాన్స్ అందుకుంది టాక్. 

ఇదిలాఉంటే సడెన్ గా ప్రియా ప్రకాష్ తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ క్లోజ్ చేసింది. దాదాపు 7.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ప్రియా ప్రకాష్ ఇన్ స్టాగ్రామ్ నుండి బయటకు వచ్చేసింది. నెటిజెన్స్ చేస్తున్న ట్రోలింగ్స్ తట్టుకోలేకనే ప్రియా ప్రకాష్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రియా ప్రకాష్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తూ కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారట. కెరియర్ మీద దృష్టి పెట్టాల్సిన టైం లో ఈ గొడవ ఎందుకు అనుకుందో ఏమో అమ్మడు ఇన్ స్టాగ్రామ్ కు బై బై చెప్పేసింది.