
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే ఒక 20 నిమిషాల పాత్రలో మెగా మేనళ్లుడు సాయి తేజ్ కనిపిస్తారట. ఇప్పటికే చాలాసార్లు రవితేజతో కలిసి నటించడం అంటే ఇష్టమని చెప్పిన సాయి తేజ్ ఇప్పుడు వచ్చిన ఈ ఛాన్స్ యూజ్ చేసుకుంటున్నాడట.
చిత్రలహరితో ఫామ్ లోకి వచ్చిన సాయి తేజ్ ప్రతిరోజూ పండుగే సినిమా ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్న సాయి తేజ్ రీసెంట్ గా దేవా కట్ట డైరక్షన్లో సినిమా ఓపెనింగ్ చేశాడు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే కాకుండా రవితేజ సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. మరి ఇద్దరు మాస్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.