
లాక్ డౌన్ కారణంగా సినీ ప్రియులు చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే వారి కోసం చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉండగా కొన్ని సినిమాలు ఆల్రెడీ ఓటిటిలో రిలీజ్ కన్ఫర్మ్ అయ్యాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ లాక్ డౌన్ టైం లో 7 సినిమాలు త్వరలో ఓటిటి ద్వారా రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది.
థియేటర్స్ మాత్రమే కాదు సీరియల్స్, రియాలిటీ షోలు లేక బుల్లితెర కూడా బోర్ కొట్టేసింది. అందుకే అందరు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు. ఎలాగూ అమెజాన్ ప్రైమ్ ఒక నెల ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ఇస్తున్నారు. అందుకే అందరు అమెజాన్ ప్రైమ్ ను ఫాలో అవుతున్నారు. రాబోయే రోజుల్లో 7 క్రేజీ సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మొదటగా తమిళ సినిమా పోన్ మగళ్ వంది సినిమా మే 29న ఓటిటిలో రిలీజ్ అవుతుంది. జూన్ 12న బాలీవుడ్ క్రేజీ మూవీ గులాబో సీతాబో కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేశారు.
జూన్ 19న తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా రిలీజ్ అవుతుంది. జూన్ 26న కన్నడ సినిమా 'లా' రిలీజ్ ప్లాన్ చేశారు. జులై 24న కన్నడ సినిమా ఫ్రెంచ్ బిర్యాని కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటుగా శకుంతలాదేవి (హిందీ), సుఫీయుమ్ సుజాతయుమ్ మలయాళ సినిమా ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ఇంకా నిర్ణయించలేదు.
నెట్ ఫ్లిక్స్ లో ఈమధ్య బాగా పాపులర్ అయినా వెబ్ సీరీస్ నర్కోస్. ఈ వెబ్ సీరీస్ ను తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బాగా చూసినట్టు సమాచారం. సో థియేటర్ రిలీజ్ తో పోల్చితే కలక్షన్స్ తక్కువ అన్న విషయం పక్కన పెడితే ఓటిటి రిలీజ్ వల్ల రీచబులిటీ ఎక్కువగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. స్మాల్ బడ్జెట్ సినిమాలకు ఫ్యాన్సీ ప్రైస్ ఆఫర్ చేసి మరి ఈ లాక్ డౌన్ టైం లో సినిమాలకు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఓటిటి రిలీజ్ చేసినా సరే మళ్ళీ దానిలో కూడా పే పర్ వ్యూ ద్వారా సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. పే పర్ వ్యూ అంటే మళ్ళీ ప్రేక్షకులు నచ్చిన సినిమానే చూసే అవకాశం ఉంటుంది. మరి సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.