టెర్రరిస్ట్ గా సమంత

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా తన సత్తా చాటుతుంది. ఈ ఇయర్ జానుతో ప్రేక్షకులను అలరించిన సామ్ నెక్స్ట్ సినిమా ఓకే చేయలేదు. అయితే క్రేజీ బాలీవుడ్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో నటిస్తుంది సమంత. ఈ వెబ్ సీరీస్ లో సమంత జాయిన్ అవడంతో మొదటి సీజన్ ను తెలుగు ప్రేక్షకులు స్పెషల్ గా చూశారు. ఫ్యామిలీ మెన్ 2 సెకండ్ సీజన్ లో సమంత రోల్ ఆడియెన్స్ కు షాక్ ఇస్తుందట. ఇందులో సామ్ టెర్రరిస్ట్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. 

ముందు మాములుగా కనిపించి ఆ తర్వాత సమంత టెర్రరిస్ట్ గా సర్ ప్రైస్ చేస్తుందట. వెబ్ సీరీస్ తో బాలీవుడ్ ఆడియెన్స్ కు షాక్ ఇవ్వనుంది అమ్మడు. ఇదే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని అనుకుంటుందట. అయితే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు.