.jpeg)
కరోనా ప్రభావంతో అన్నిటితో పాటుగా సినిమా హాళ్లు మూసివేయడం జరిగింది. అయితే పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే థియేటర్లు తెరచుకునేలా లేవు. అందుకే నిర్మాతలు కొందరు తమ సినిమాలు డిజిటల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వీటిలో కొన్ని క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. కొన్నాళ్ళుగా డిస్కషన్లో ఉన్న అనుష్క నిశ్శబ్దం సినిమా ఓటిటి రిలీజ్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా మెగా హీరో సినిమా కూడా ఓటిటి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాకే రిలీజ్ అడ్డంకులు ఏర్పడ్డాయి.
థియేటర్ లు అప్పుడే తెరచుకునే పరిస్థితి కనబడటం లేదు అందుకే ఉప్పెన సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సుకుమార్ ఈ మూవీకి సమర్పకుడిగా ఉంటున్నారు. మరి వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఓటిటి రిలీజ్ చేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచాయి.