90ML కిక్కు బాగా ఎక్కింది..!

ఆరెక్స్ 100తో హీరోగా సూపర్ సక్సెస్ అందుకున్న కార్తికేయ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న కార్తికేయ ఆరెక్స్ 100 తర్వాత హిట్టు కొట్టడంలో వెనుకపడ్డాడు. హీరోగానే కాదు నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటించి మెప్పించిన కార్తికేయ లేటెస్ట్ మూవీ 90 ఎంఎల్ బుల్లితెర మీద కిక్కు బాగా చూపించింది. 

కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమాను శేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. కార్తికేయ తండ్రి అశోక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటలేదు కాం స్మాల్ స్క్రీన్ పై మాత్రం మంచి రేటింగ్ తెచ్చుకుంది. 90 ఎంఎల్ మే 2న స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. లాక్ డౌన్ వల్ల అందరు ఇళ్లలోనే ఉండటంతో ఈ సినిమా చూశారు. అంతేకాదు సినిమాకు ఊహించని విధంగా రేటింగ్ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మాలో టెలికాస్ట్ అయినా కార్తికేయ 90 ఎంఎల్ సినిమాకు 10. టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఛానెల్ వారు కూడా షాక్ అయ్యేలా ఈ సినిమా రేటింగ్స్ రావడం విశేషం. ఎప్పుడు స్టార్ హీరోల సినిమాలకు, సూపర్ హిట్ సినిమాలకు మాత్రమే వచ్చే ఈ రేంజ్ రేటింగ్ కార్తికేయ ప్లాప్ సినిమాకు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.