ఇండియన్ 2 మరో బాహుబలి..?

పాతికేళ్ల క్రితం రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ లో యాక్సిడెంట్ వల్ల కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న చిత్రయూనిట్ త్వరలో సినిమాను  తీసుకెళ్లనున్నారని తెలుస్తుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. 

కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇండియన్ 2 సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి తరహాలో మొదటి భాగాన్ని ఒక ట్విస్ట్ తో ముగించి రెండో భాగాన్ని రెండో పార్ట్ లో చూపిస్తారట. మరి ఇండియన్ 2 నిజంగానే రెండు పార్టులుగా వస్తుందా.. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.