
సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న డైరక్టర్ శేఖర్ కమ్ముల. ఆనంద్ నుండి ఫిదా వరకు ఆయన చేసిన సినిమాలు చాల ప్రత్యేకంగా ఉంటాయి. ఇక కరోనా వల్ల లాక్ డౌన్ టైం లో జీహెచ్ఎంసీ పారిశుద్య కార్మికులు పడుతున్న కష్టానికి వారికి బాదం పాటూ, మజ్జిగ ప్యాకెట్ లను శేఖర్ కమ్ముల అందించారు. ఐతే అందుకు అభినందనలు తెలుపుతూ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఆవరణలో పారిశుధ్య కార్మికులందరూ థ్యాంక్యూ శేఖర్ కమ్ముల గారు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
పారిశుధ్య కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినందుకు గాను శేఖర్ కమ్ములకు వారు ఈ విధంగా అభినందనలు తెలియచేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై స్పందించారు శేఖర్ కమ్ముల. గాంధీ హాస్పిటల్ ఆవరణలో పారిశుధ్య కార్మికులు చేసిన పనికి ఆశ్చర్యపోయాను.. వారు చేస్తున్న దానితో పోల్చుకుంటే తాను చేసింది చాల తక్కవ అని.. వారి ప్లకార్డు ప్రదర్శన తనకు పెద్ద అవార్డు గా భావిస్తానని అన్నారు శేఖర్ కమ్ముల.