
ఓ పక్క కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీస్ అంతా ఇళ్లకే పరిమితం కాగా.. సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఈ టైం లోనే టాలీవుడ్ లో పెళ్లిసందడి మొదలైంది. లాక్ డౌన్ కు కొద్దిరోజులు ముందే యువ హీరో నితిన్ కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న షాలినితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అన్ని బాగుంటే ఏప్రిల్ 15న నితిన్, షాలినిల పెళ్లి జరగాల్సింది కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు.
ఇక మరో యువ హీరో నిఖిల్ కూడా పల్లవి వర్మని ప్రేమించి పెళ్ళాడుతున్నాడు. వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ కూడా లాక్ డౌన్ టైం లోనే జరిగింది. ఇక పెళ్లి రెండు సార్లు వాయిదా పడగా రేపు అనగా మే 14న కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరుగనుందని తెలుస్తుంది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక లేటెస్ట్ గా దగ్గుబాటి వారసుడు రానా కూడా తాను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో రివీల్ చేశారు. మిహికా బజాజ్ ను పెళ్ళాడుతున్న విషయాన్ని వెల్లడించాడు రానా. ఈ ఇయర్ లోనే రానా పెళ్లంటూ నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. మొత్తానికి టాలీవుడ్ లో పెళ్లిసందడి మొదలైంది.. మాములుగా ఐతే చాల ఖర్చుతో చేసుకునే ఈ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చాలా సింపుల్ గా కానిచ్చేస్తున్నారు.