పవన్ కళ్యాణ్ మరో రీమేక్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన లిస్ట్ లో చాలా సినిమాలు పెట్టాడు. పింక్ రీమేక్ గా వస్తున్నా వకీల్ సాబ్ సెట్స్ మీద ఉండగా క్రిష్ సినిమా కూడా త్వరలో షూటింగ్ కు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఇదిలాఉంటే ఈ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను తెలుగులో రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రీమేక్ లో కూడా పవన్ నటిస్తాడని టాక్. 

పృథ్వి రాజ్ సుకుమారన్, సూరజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను లాల్ జూనియర్ డైరెక్ట్ చేశారు. సాచి కథ అందించగా లాల్ జూనియర్ అద్భుతమైన కథనంతో తెరకెక్కించారు. స్టార్ హీరో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎంత తిప్పలు పడ్డాడు.. అతని అభిమాని అయిన లైసెన్స్ ఆఫీసర్ ఎందుకు ఆ స్టార్ హీరోని ఇబ్బంది పెట్టాడు అన్నది సినిమా కథ. సినిమా బడ్జెట్ కూడా పెద్దగా పెట్టినట్టు లేని ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. మరి ఈ రీమేక్ లో పవన్ నటించడం ఎంతవరకు వాస్తవం అన్నది చూడాలి.