
మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు. తెలుగులో మిస్ ఇండియాతో పాటుగా నితిన్ హీరోగా వస్తున్నా రంగ్ దే సినిమా చేస్తుంది. ఈ సినిమాతో పాటుగా కోలీవుడ్ డైరక్టర్ ఈశ్వర్ కార్తీక్ డైరక్షన్ లో పెంగ్విన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాలో కీర్తి సురేష్ గర్భిణిగా కనిపించబోతుంది. థ్రిల్లర్ మూవీగా వస్తున్నా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.
కానీ కరోనా వల్ల లాక్ డౌన్ టైం నడుస్తుంది కాబట్టి ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారుకీర్తి సురేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసినా సినిమా సేఫ్ జోన్ లోకి వస్తుందని భావించి అమెజాన్ ప్రైమ్ కు పెంగ్విన్ సినిమా అమ్మేశారని టాక్. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించిందని అంటున్నారు. మరి ఈ సినిమా నిజంగానే ఓటిటి రిలీజ్ అవుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.