పవర్ స్టార్ కోసం మలయాళ ముద్దుగుమ్మ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా ముహూర్తం కూడా పెట్టేశారు. ఇక మరోసారి గబ్బర్ సింగ్ కాంబోలో సినిమా వస్తుందని అంటున్నారు. హరీష్ శంకర్ డైరక్షన్ లో పవర్ స్టార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. 

ఈ సినిమాలో హీరోయిన్ గా మళయాళ భామ మానస రాధాకృష్ణన్ నటిస్తుందని తెలుస్తుంది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి సినిమాలు చేస్తున్న మానస హీరోయిన్ గా కూడా సత్తా చాటుతుంది. మలయాళంలో కాకుండా తమిళంలో ఒక సినిమా చేసిన మానస తెలుగులో ఏకంగా పవర్ స్టార్ సరసన నటిస్తుందని తెలుస్తుంది. అదే నిజమైతే అమ్మడికి టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దొరికినట్టే. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబో లో వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఆ అంచనాలకు తగినట్టుగా ఉంటుందో లేదో చూడాలి.