
మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కు ముందే సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. బుచ్చిబాబు డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక సినిమాలో నీ కన్ను నీలి సముద్రం సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు అందుకుంటుంది. ఈ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ సాధించింది.
వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ ముందే రికార్డులు కొడుతోంది. ఈ సినిమాకు సుకుమార్ పర్యవేక్షణ చేస్తుండటం విశేషం. సాంగ్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా రిలీజ్ తర్వాత కూడా సినిమా ప్రేక్షకులను అలరించడం పక్కా అంటున్నారు. సినిమా రిలీజ్ కు ముందే సూపర్ అనిపించుకుంటుంది. '