
మెగా మేనళ్లుడు సాయి తేజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆరు వరుస ప్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినా సాయి తేజ్ ఆ తర్వాత ప్రతిరోజూ పండుగే సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా సాయి తేజ్ మరో క్రేజీ రికార్డ్ అందుకున్నాడు. ట్విట్టర్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన సాయి తేజ్ ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఏర్పరచుకున్నాడు.
ప్రస్తుతం సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. సుబ్బు డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత దేవా కట్టా డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆరు ప్లాపుల తర్వాత వరుస రెండు హిట్లు కొట్టిన సాయి తేజ్ ఇక మీదట కథల విషయంలో జాగ్రత్తలు పడుతున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మీద చాల హోప్స్ పెట్టుకున్నాడు సాయి తేజ్.