
మొదట్లో సినిమాలు ప్రయత్నించిన శ్రీముఖి ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ ను షిఫ్ట్ అయ్యింది. తన యాంకరింగ్ టాలెంట్ తో బుల్లితెర ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న శ్రీముఖి అడపాదడపా సినిమాలు చేస్తున్నా వాటి వల్ల తన కెరియర్ కు ఏమాత్రం హెల్ప్ అవట్లేదు. అందుకే సోలోగా ట్రై చేయాలనీ ఫిక్స్ అయ్యింది ఈ అమ్మడు. అలా అనుకున్నాడో లేదో ఓ సినిమా ఆఫర్ కూడా వచ్చేసింది.
శ్రీముఖి లీడ్ రోల్ లో ఇట్స్ టైం టూ పార్టీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను గౌతమ్ ఈవీఎస్ డైరెక్ట్ చేస్తున్నారు. నూతన దర్శకుడు అయినా సరే అతను చెప్పిన కథ, కథనాలు చాల బాగున్నాయని అందుకే ఈ సినిమా చేస్తున్నానని శ్రీముఖి అన్నారు. ఇక లేటెస్ట్ గా శ్రీముఖి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను సర్ ప్రయిజ్ చేస్తుందని చెబుతుంది శ్రీముఖి. మరి సిల్వర్ స్క్రీన్ పై శ్రీముఖి హంగామా ఎలా ఉంటుందో చూడాలి.