దిల్ రాజు రెండో పెళ్లి..!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లెలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దిల్ రాజు తేజస్విల వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వివాహ కార్యక్రమం జరిగింది. 2017లో దిల్ రాజు మొదటి భార్య అనిత హార్ట్ ఎటాక్ తో మరణించారు. మూడేళ్ళుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న దిల్ రాజు తేజస్విని అలియాస్ వైఘా రెడ్డిని పెళ్లాడారు. 

డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలుపెట్టి నిర్మాతగా సూపర్ సక్సెస్ అయినా దిల్ రాజు ప్రస్తుతం నాని వి సినిమా నిర్మించారు. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆ సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. దిల్ రాజు రెండో పెళ్లి గురించి తెలుసుకున్న సెలబ్రిటీస్ తమ విషెస్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేస్తున్నారు.