
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వైజయంతి బ్యానర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాంబో సెట్ చేశారు. ఈ సినిమాను స్టైల్ లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. సినిమా కథ విన్న నిర్మాత అశ్వనీదత్ షాక్ అయ్యారట.. ప్రభాస్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా అశ్వనీదత్ కు సరైన కథ దొరకడంతో సినిమా షురూ చేశారు.
పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ మూవీలో విలన్ గా అరవింద స్వామిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తమిళంలో హీరోగా సెన్సేషనల్ సినిమాలు చేసిన అరవింద స్వామి తన సెకండ్ ఇన్నింగ్స్ ను విలన్ గా కొనసాగిస్తున్నారు. తని ఒరువన్ తో విలన్ గా ఆకట్టుకున్న అరవింద స్వామి ఆ సినిమా తెలుగు రీమేక్ ధృవలో కూడా నటించి మెప్పించాడు. ఇక ప్రభాస్ 21వ సినిమాలో కూడా అరవింద స్వామిని విలన్ గా సెలెక్ట్ చేశారని టాక్. క్రేజీ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.