
కన్నడ హీరో యష్, క్రేజీ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కెజిఎఫ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. కన్నడ నుండి వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్ తీస్తున్నారు. కెజిఎఫ్ 2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, ట్ రవీనా టాండన్ నటిస్తున్నారు.
సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ అంచనాలు పెంచగా ఈ సినిమా టీజర్ మరికొద్దిరోజుల్లో రాబోతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ లో దూకుడు చూపిస్తుంది. థియేట్రికల్ బిజినెస్ బజ్ బాగున్నా డిజిటల్ రైట్స్ అమెజాన్ అత్యంత భారీ రేటుకి కొనేసిందని తెలుస్తుంది. కెజిఎఫ్ 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ 55 కోట్లకు కోట్ చేసిందట. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ సినిమా రిలీజ్ అయ్యే ఐదు భాషలకు కలిపి ఈ రేటు ఫిక్స్ చేశారట. డీల్ నచ్చడంతో చిత్రయానిట్ కూడా కెజిఎఫ్ 2 రైట్స్ ఇచ్చేశారట. మొత్తానికి రిలీజ్ కు ముందే కెజిఎఫ్ 2 సంచనాలు సృస్తిస్తుంది. మరి రిలీజ్ తర్వాత ఈ సీనియా రిలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.