RRR సీత ఫస్ట్ లుక్

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ సినిమాపై మరింత అంచనాలు పెంచగా అల్లూరి టీజర్ మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రయిజ్ చేసింది. ఇక ట్రిపుల్ ఆర్ నుండి ఎన్టీఆర్ టీజర్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

మే 20 తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ కొమరం భీమ్ టీజర్ వస్తుందని టాక్. అయితే ఈలోగా సినిమా నుండి మరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ ఫస్ట్ లుక్ ఈ వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించడం సినిమాకు ప్లస్ అవనుంది. 2021 జనవరి 8 రిలీజ్ అనుకుంటున్న ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.