
వైజయంతి మూవీస్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ తో సినిమా ఎనౌన్స్ చేశారు నిర్మాత సి.అశ్వనీదత్. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా ఒక భారీ బడ్జెట్ సినిమా ఈమధ్యనే ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇక ఈ సినిమాతో పాటుగా జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వల్ ప్లానింగ్ లో ఉందని అన్నారు అశ్వనీదత్. జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా మే 9కి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాకు సంబందించిన 3 హిడెన్ స్టోరీస్ వీడియోస్ బయట పెడుతున్నారు.
అందులో ఒకటి ఆ సినిమా ఎలా మొదలైంది అన్న విషయాన్ని నాని తన వాయిస్ ఓవర్ తో చెబుతాడు. ఇక ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అశ్వనీదత్ ప్రభాస్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి 2022 లో రిలీజ్ చేస్తారని వెళ్లడించారు. ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వల్ కథ రెడీగా ఉందని.. ఆ సినిమా తీసి నిర్మాతగా తను రిటైర్ అవుతా అంటున్నారు అశ్వనీదత్. మరి ఆ సీక్వల్ లో కాస్టింగ్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.