
భాగమతి తర్వాత స్వీటీ అనుష్క చేసిన సినిమా నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో కోనా వెంకట్ ఈ సినిమా నిర్మించారు. మాధవన్, షాలిని పాండే కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ సినిమాల్లో ఇది కూడా ఒకటి. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తారని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తే. అయితే మొదట్లో చిత్రయూనిట్ ఆ వార్తలను ఖండించే ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది.
కరోనా వల్ల మార్చి మూడవ వారం నుండి రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. ఇలాంటి టైంలో ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసి.. సినిమాల రిలీజ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నిశ్శబ్దం సినిమా రిలీజ్ డేట్ మిగతా సినిమాలతో పోటీ పడటం ఖాయం. ఇక కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. అందుకే మే 17 నుండి లాక్ డౌన్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అందుకే నిశ్శబ్దం సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
ప్రస్తుతం అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా ఈ మూడింటిలో ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికే నిశ్శబ్దం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. అదే జరిగితే ఈ లాక్ డౌన్ టైం లో ఓటిటిలో రిలీజ్ అయ్యే మొదటి పెద్ద సినిమా ఇదే అవుతుందని చెప్పొచ్చు. నిశ్శబ్దం సినిమా మీద అనుష్క చాల హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.