పవర్ స్టార్ తో అనుష్క..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో పింక్ రీమేక్ గా వస్తున్నఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తాడని తెలిసిందే. ఆల్రెడీ ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన అనుష్క హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. 

పవన్ కళ్యాణ్ తో అనుష్క నిజంగా ఇదో క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బాహుబలి, భాగమతి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ మీనన్ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఒక సినిమాలో అనుష్క నటిస్తుందని అంటున్నారు. ఆ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ సినిమాకు సంబందించిన డిస్కషన్స్ కూడా జరిగాయట. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన వేదం సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. పవర్ స్టార్ తో స్వీటీ జోడీ ఎలా ఉండబోతుందో చూడాలి.