
అల వైకుంఠపురములో సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించిన థమన్ కు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటున్న థమన్ లేటెస్ట్ గా కోలీవుడ్ నుండి అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్.. క్రేజీ డైరక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా తుపాకీ సీక్వల్ గా ఒక సినిమా మొదలు కానుందట. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
తెలుగుతో పాటుగా థమన్ తమిళ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నా స్టార్ ఛాన్సులు రాలేదని చెప్పొచ్చు. అక్కడ అనిరుద్, జిబ్రాన్, జివి ప్రకాష్ లాంటి వారు వరుస ఛాన్సులు అందుకుంటున్నారు. అల వైకుంఠపురములో సినిమా చూశాక సినిమా హిట్ లో మ్యూజిక్ కూడా భాగం అవుతుందని మరోసారి ప్రూవ్ చేశాడు థమన్. తుపాకీ 2 కోసం థమన్ సెలెక్ట్ చేయడంతో థమన్ తమిళంలో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.