
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల వేగాన్ని పెంచారు. ఓ పక్క ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ జరుగుతుండగా తన నెక్స్ట్ రెండు సినిమాల ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. రాజమౌళి ట్రిపుల్ ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసేలా ప్లాన్ చేసుకున్న తారక్ ఆ తర్వాత కన్నడ స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. కెజిఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఎఫ్-2 సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తోనే అతని సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఎన్టీఆర్ తో కెజిఎఫ్ డైరక్టర్ ఆకాశాలే హద్దు అనేలా అంచనాలు ఏర్పడటం ఖాయం. అసలు తెలుగు వాళ్లకు పరిచయం లేని యష్ ను ఇక్కడ స్టార్ చేసిన ప్రశాంత్ నీల్ ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న తారక్ తో ఎలాంటి సంచలన సినిమా చేస్తాడో అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో బయటకు రానుంది.