సిని పరిశ్రమకు అండగా ఉంటాం..!

సినిమా పరిశ్రమకు తెలంగాణా ప్రభుత్వ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయానికి వచ్చిన మంత్రికి చిత్ర పరిశ్రమలోని సమస్యల గురించి వినతిపత్రం అందించారు. సినిమా షూటింగ్ లేకపోవడం వల్ల సినీ కార్మికులు, నిర్మాతలు నష్టపోతున్నారని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు చెప్పారు. సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడం పెద్ద విషయమేమి కాదు కానీ ఇలాంటి టైంలో షూటింగ్ చేయడం కన్నా కొద్దిరోజులు ఓపిక పడితే మంచిదని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.   

కరోనా ఎలా వస్తుందో ఎవరికీ తెలియదని.. అందుకే కొన్నాళ్లపాటు షూటింగ్స్ ఆపేస్తేనే బెటర్ అని.. దశలవారీగా కొన్నిటికి అనుమతులు ఇస్తున్నాం.. సినిమా చిత్రీకరణ గురించి చర్చిస్తామని వెళ్లడించారు. షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయమై కేరళలో పాటుగా ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి జూన్ లో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు తలసాని శ్రీనివాస యాదవ్. సీసీసీ చారిటీ ద్వారా సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించడం శుభపరిణామని అన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో నిర్మాత మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్. కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్ గిల్డ్ అధ్యక్షుడు దిల్ రాజు పాల్గొన్నారు.