చైతు ప్రొడక్షన్ లో మొదటి సినిమా అదే..!

అక్కినేని నాగ చైతన్య, సమంత కలిసి సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాడన్న వార్తలు తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ నాగార్జున సినిమాలు నిర్మిస్తుండగా కొత్తవారికి ఛాన్స్ ఇస్తూ నాగ చైతన్య, సమంతలు కూడా సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. రాజ్ తరుణ్ హీరోగా చైతు నిర్మాణంలో సినిమా మొదలు కానుందట. ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

యువ హీరో రాజ్ తరుణ్ కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. చైతు, సమంతల సపోర్ట్ తో కెరియర్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా అవికా గోర్ నటిస్తుందని తెలుస్తుంది. ఉయ్యాల జంపాలలో కలిసి నటించిన ఈ జంట మరోసారి ప్రేక్షకులను మెప్పించనున్నారు.