
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనని టార్గెట్ చేసిన వెబ్ సైట్ పై ఫైర్ అయ్యాడు. తనని రెండు రోజుల క్రితం ఇంటర్వ్యూ అడిగిన ఈ వెబ్ సైట్ తాను ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదని చెప్పడంతో తన మీద నెగటివ్ వార్తలు రాస్తున్నారని.. ఆ వెబ్ సైట్ లో వచ్చిన వార్తలని చూపిస్తూ విజయ్ దేవరకొండ ఇలాంటి ఫేక్ సైట్స్, ఫేక్ న్యూస్ లను నమ్మొద్దని ప్రజలను రిక్వెస్ట్ చేశారు. ఇక మిడిల్ క్లాస్ ఫండ్ స్టార్ట్ చేసి కొంతమందికి సహాయం చేద్దామని అనుకోగా.. 7500 మందికి మాత్రమే విజయ్ సహాయం చేశాడని.. నాకు నచ్చినట్టుగా నేను చేశాను మరి మీరు ఏం చేస్తున్నారని వెబ్ సైట్ వాళ్ళని ప్రశ్నించాడు విజయ్ దేవరకొండ.
సినిమా యాడ్స్ వేస్తూ.. సినిమా వాళ్ళ మీద బ్రతికే ఈ సైట్స్ మళ్ళీ సినిమా వాళ్ళ మీదే ఫేక్ న్యూస్ రాస్తూ పబ్బం గడుపుతున్నాయని ఫైర్ అయ్యారు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ లేవనెత్తిన పాయింట్ బాగున్నా మా మీద బ్రతికే మీరు మా గురించి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయడం అన్న మాట మాత్రం కొందరి మీడియా వాళ్ళను నొప్పిస్తుంది. ఇక విజయ్ కు సపోర్ట్ గా సూపర్ స్టార్ మహేష్, మెగా బ్రదర్ నాగబాబు, దర్శకులు కొరటాల శివ, అనీల్ రావిపూడి ట్వీట్స్ చేశారు.