
భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా అందాదున్ రీమేక్ కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు నితిన్. ఈ రెండిటితో పాటుగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్స్ ఆపేశారు.
ఇక లేటెస్ట్ గా నితిన్ కృష్ణ చైతన్య డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. పవర్ పేట టైటిల్ తో వస్తున్నా ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారట. ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. నితిన్, కీర్తి సురేష్ మొదటి సినిమా రంగ్ దే రిలీజ్ కాలేదు అయినా మళ్ళీ ఈ ఇద్దరు జతకడుతున్నారు. ఛల్ మోహనరంగ సినిమా తర్వాత డైరక్టర్ కృష్ణ చైతన్య, నితిన్ చేస్తున్న ఈ పవర్ పేట మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముందే రెండు పార్టులుగా డిసైడ్ చేసి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని చెప్పొచ్చు.