
కరోనా క్రైసిస్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశారు. దాని వల్ల చాలామంది సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. అయితే ఇంతటి గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవికి ఓ బహిరంగ లేఖ రాశాడు సినీ హీరో, దర్శకుడు జె.డి చక్రవర్తి. డియర్ చిరంజీవి నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను.. సీసీసీ పనితీరు.. చిరు ప్రస్తుతం సినిమా పరిశ్రమ కోసం చేస్తున్న పనుల గురించి జెడి తన లెటర్ లో ప్రస్తావించారు.
చిరుని ఉద్దేశిస్తూ మీరు సిని పరిశ్రమ రుణం తీర్చుకుంటున్నారని.. మీ హృదయం సరైన స్థానంలో ఉంది.. చాలామందికి హృదయం ఉంటుంది కానీ సరైన స్థానంలో ఉండదు నాతో సహా.. నలుగురి ఆనందం కోరుకునే మీ వ్యక్తిత్వం గొప్పది. ఇప్పుడు నేను మెగాస్టార్ ను మరింత అభిమానిస్తున్నా అంటూ జె.డి ఒక ఎమోషనల్ లెటర్ రాయడం విశేషం. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"You are not a Megastar anymore" - JD Chakravarthy about @KChiruTweets. #lockdown#Covid_19india #stayhome pic.twitter.com/n40lNkqYj8