రాశి కన్నా క్రేజీ ఆఫర్..!

టాలీవుడ్ లో యువ హీరోల సరసన నటిస్తూ కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న రాశి ఖన్నాకు ఇప్పుడు కోలీవుడ్ నుండి కూడా లక్కీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా సూర్య హీరోగా చేస్తున్న అరువ సినిమాలో ఛాన్స్ అందుకుందట. తమిళ క్రేజీ దర్శకుడు హరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య సరసన రాశి ఖన్నాని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. 

తెలుగులో లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో సాయి తేజ్ సరసన ప్రతిరోజూ పండుగే సినిమాలో నటించి హిట్ అందుకున్న రాశి ఖన్నా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో నిరాశపరచింది. తెలుగు, తమిళంతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఛాన్సులు పట్టేస్తున్న అమ్మడు తన టాలెంట్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. తెలుగులో స్టార్ ఛాన్సులు రాకపోయినా తమిళంలో సూర్య సినిమా హిట్ అయితే మాత్రం అమ్మడికి అక్కడ స్టార్ హీరోల ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.