అలనాటి తారలతో చిరు అదిరిపోయే డ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి అంటేనే అందరికి గుర్తొచ్చేది ఆయన గ్రేస్ ఫుల్ డ్యాన్స్. తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసింది మన మెగాస్టారే.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన డ్యాన్స్ అంటే చాలు ఆడియెన్స్ ఫిదా అవ్వాల్సిందే. రీ ఎంట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న చిరు అలనాటి తారలతో డ్యాన్స్ చేసిన వీడియో షేర్ చేశారు. ప్రతి సంవత్సరం 80ల్లో నటించిన తారలంతా ఒకచోట చేరి హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. 

లాస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ మీటింగ్ ఏర్పటుచేశారు. ఆ టైంలో చిరుతో అలనాటి అందాల భామలు డ్యాన్స్ చేసిన వీడియో తన సోషల్ బ్లాగ్ లో షేర్ చేశారు మెగాస్టార్. సుహాసిని, రాధా, ఖుష్భు, జయప్రద, జయసుధ వీళ్లంతా కలిసి చిరుతో స్టెప్పులేయడం విశేషం. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమధ్యనే ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఎంట్రీ ఇచ్చిన చిరు రోజు ఏదో ఒక సర్ ప్రయిజ్ తో అభిమానులను అలరిస్తున్నాడు.