వింక్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్న మహేష్..!

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ పరశురామ్ డైరక్షన్ లో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. తన 17 ఏళ్ల కల నెరవేరబోతోంది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు డైరక్టర్ పరశురామ్. గీతా గోవిందం తర్వాత చేస్తే స్టార్ తోనే సినిమా చేయాలని అనుకున్న పరశురామ కోరిక తీరబోతుంది. మహేష్ తో మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీస్తున్నాడట పరశురామ్. ఈ సినిమాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఎలివేషన్ సీన్స్ కు ఏమాత్రం ఢోకా ఉండదని చెబుతున్నాడు పరశురామ్. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీ, పూజా హెగ్డేలు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం మహేష్ సరసన నటించేది వాళ్లిద్దరు కాదట వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ అని అంటున్నారు. ఓరు ఆధార్ లవ్ సినిమా టీజర్ లో కన్నుగీటి కుర్రాళ్ళ హృదయాలను కొల్లగ్గొట్టిన ప్రియా ప్రకాష్ ఆ సినిమాను తెలుగులో రిలీయేజ్ చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత అమ్మడికి తెలుగులో స్టార్ ఛాన్సులు వచ్చాయన్న వార్తలు వైరల్ అయ్యాయి. 

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో వస్తున్న చందరంగం సినిమాలో ప్రియా ప్రకాష్ నటిస్తుంది. ఇక సెకండ్ ఛాన్స్ గా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో సెలెక్ట్ అయ్యిందట. పరశురామ్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు మంచి గుర్తింపు ఉంటుంది.. మహేష్ కు జోడీగా పరశురామ్ డైరక్షన్ లో ఛాన్స్ అంటే.. ఇదే నిజమైతే ప్రియా ప్రకాష్ ఫేట్ మారిపోయినట్టే అని చెప్పొచ్చు.