
ఎఫ్-2తో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వచ్చిన వెంకీమామ సినిమాతో కూడా సత్తా చాటిన విక్టరీ వెంకటేష్ చాలారోజుల తర్వాత తన సక్సెస్ ను దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో సూపర్ హిట్ అయినా అసురన్ రీమేక్ గా నారప్ప సినిమాలో నటిస్తున్న వెంకటేష్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అదేంటి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా ఎనౌన్స్ చేశారు కదా అనుకోవచ్చు. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా కోసం ఇంకొన్ని రోజులు డేట్స్ అడ్జెస్ట్ చేసేలా పరిస్థితులు కనబడుతున్నాయి.
అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ తారక్ సినిమా చేయాలని అనుకున్నా ఎన్టీఆర్ తో సినిమా ఎలా లేదన్నా 6 నెలలు టైం పట్టేట్టు ఉందని ఈలోగా విక్టరీ వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఆల్రెడీ త్రివిక్రమ్ రైటింగ్స్ లో వచ్చిన వెంకీ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే డైరక్టర్ గా మారిన తర్వాత వెంకటేష్ తో కలిసి పనిచేయలేదు. మరి ఈ క్రేజీ కాంబో సెట్ అయితే కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమా వస్తుందని చెప్పడంలో ఎలా సందేహం లేదు.