జగదేక వీరుడు అతిలోక సుందరి 3 హిడెన్ స్టోరీస్..!

1990 మే 9 రిలీజైన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు అశ్వనీదత్. వైజయంతి బ్యానర్ కెపాసిటీని పెంచిన సినిమా అది. అకాల వర్షాలను కూడా లెక్క చేయకుండా బొమ్మని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు. ఈ నెల 9కి ఆ సినిమా రిలీజై 30 ఏళ్ళు అవుతుంది. అందుకు సర్ ప్రయిజ్ గా మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమాకు సంబందించిన 3 హిడెన్ స్టోరీస్ బయట పెడతారట. 

చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ అఫీషియల్ గా తన సోషల్ బ్లాగ్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. సినిమాకు సంబందించిన తేరా వెనుక జరిగిన 3 సీక్రెట్స్ ను 5,7,9 తేదీలలో నాచురల్ స్టార్ నాని ద్వారా రివీల్ చేయిస్తారట. 30 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ రికార్డులు కొట్టిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సంబందించిన 3 హిడెన్ స్టోరీస్ అనగానే ఆడియెన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది.