
రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన వంగవీటి సినిమాతో ఫేమ్ లోకి వచ్చాడు సందీప్ మాధవ్ అలియాస్ శాండీ. ఎన్నో వివాదాల మధ్య రిలీజైన ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా అందులో వంగవీటి రాధా, రంగ పాత్రల్లో నటించిన శాండీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అతనితోనే జార్జ్ రెడ్డి సినిమా తీశారు డైరక్టర్ జీవన్ రెడ్డి. అంతకుముందు సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన సందీప్ మాధవ్ ఇప్పుడు కాస్త ఐడెంటిటీ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ సినిమాలో ఈ యువ హీరోకి ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శాండీని సెలెక్ట్ చేశారట. సినిమాలో బాలయ్య బ్రదర్ పాత్రలో అతను కనిపిస్తాడట. హీరోగా ప్రత్యేకమైన సినిమాలు చేస్తున్న సందీప్ మాధవ్ కు బాలయ్య ఆఫర్ కచ్చితంగా అతని కెరియర్ కు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. బోయపాటి బాలయ్య బాబు కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్నా ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. అందులో ఒక రోల్ అఘోరాగా కనిపిస్తాడని టాక్.