లవ్ చేసే టైం లేదట

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో కెరియర్ లో జోష్ అందుకుంది. అమ్మడు ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాలో నటిస్తుంది. మహేష్ మేనళ్లుడు గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్తున్న ఈ హాట్ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. 

సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా యువత మనసులు దోచేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతానికి తన స్టేటస్ సింగిల్ అంటుంది. అప్పట్లో ఇండియన్ క్రికెటర్ కె.ఎల్ రాహుల్ తో లవ్ స్టోరీ నడిపిస్తున్న వార్తలు తిప్పి కొట్టిన నిధి, తన ఫోకస్ అంతా సినిమాల మీద ఉందని.. వరుస సినిమాలతో అసలు లవ్ చేయడం కాదు దాని గురించి ఆలోచించే టైం కూడా లేదని అంటుంది నిధి అగర్వాల్. లాక్ డౌన్ టైం లో ఆన్ లైన్ యాక్టింగ్ కోర్సులు నేర్చుకుంటున్న నిధి రాబోయే సినిమాల్లో ఇంకాస్త పరిణితితో నటిస్తుందని చెప్పొచ్చు.