
అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు చిన్నపాటి గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ గా వసున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇంపార్టెంట్ రోల్ లో నివేదా థామస్ నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో కోలీవుడ్ యువ హీరో శివ కార్తికేయన్ ఒక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. తమిళంలో మంచి ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో గెస్ట్ రోల్ లో మెప్పించిన శివ కార్తికేయన్ పవన్ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎక్సయిట్ అయ్యారు. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చిత్రయూనిట్ వెళ్లడించింది.