నయనతార మళ్ళీ బ్రేకప్..?

కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ నయనతార మూడవ లవ్ స్టోరీ కూడా బ్రేకప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. శింబుతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపించిన నయనతార అతనికి గుడ్ బై చెప్పి డైరక్టర్ కమ్ హీరో ప్రభుదేవాతో ప్రేమలో పడ్డది. ఇక నేడో రేపో పెళ్లి అని హడావిడి చేయగా ఫైనల్ గా ప్రభుదేవాతో కూడా నయన్ దూరంగా వచ్చేసింది. ఇక కొన్నాళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు కనిపించిన నయనతార ఇప్పుడు అతనికి బై బై చెప్పేసింది అంటున్నారు. 

కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం విఘ్నేష్ శివన్, నయనతార డేటింగ్ లో ఉన్న విషయం వాస్తవమే కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ ఎడమొహం పెడమొహం లా ఉంటున్నారట. ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి వచ్చిందట. తేడా ఎక్కడ వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ నయన్ 3వ లవ్ స్టోరీ కూడా బ్రేకప్ అయ్యిందన్న న్యూస్ తమిళ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ వార్తలు వస్తున్నా విఘ్నేష్ శివన్ కానీ, నయన్ కానీ ఖండించకపోవడం విశేషం. శింబు, ప్రభుదేవాల కన్నా విఘ్నేష్ తో లాంగ్ టైం రిలేషన్ మెయింటైన్ చేసిన నయన్ నిజంగాఈ అతనికి దూరంగా ఉంటుందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.