మహేష్ ఆఫర్ రిజెక్ట్ చేసిందా..!

సూపర్ స్టార మహేష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ కియరా అద్వాని ఆ సినిమాతో హిట్టు కొట్టి ఆ తర్వాత వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తుండటంతో కియరా అద్వాని అక్కడ బిజీ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఛాన్సులు వస్తున్నా సరే ఆమె ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. 

లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినా సరే కియరా డేట్స్ ఖాళీ లేవని చెప్పిందట. మహేష్ లాంటి స్టార్ ఛాన్స్ వచ్చినా వదులుకునేంత బిజీగా ఉందా అని విమర్శలు చేస్తున్నారు. ఓ పక్క సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో నిజంగానే కియరా అద్వానీ బిజీగా మారింది. తెలుగులో నటించాలన్న కోరిక ఉన్నా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకనే ఆమె ఇక్కడ సినిమాలు మిస్ అవుతుందట. మొత్తానికి బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా కియరా ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పొచ్చు.