రౌడీ హీరో ప్రేమలో పడ్డాడా..?

అతితక్కువ కాలంలోనే యువ హీరోల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడని చెప్పొచ్చు. రౌడీ హీరో ట్యాగ్ లైన్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పూరి డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశాడు. బాలీవుడ్ లో సినిమా చేయకపోయినా అక్కడ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. 

ఇక ప్రస్తుతం ఫైటర్ సినిమా అప్డేట్స్ గురించి విజయ్ తో నేషనల్ మీడియా చిట్ చాట్ చేసింది. ఈ సినిమాను కారం జోహార్ హింది వర్షన్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టే అక్కడ ఫైటర్ కు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తనకు కాబోయే అమ్మాయి లక్షణాలు ఎలా ఉండాలో చెప్పాడు రౌడీ హీరో. అయితే అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మీ జీవితంలో ఎదురైందా అంటే అవునని సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అతను అలా చెప్పాడో లేదో విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నట్టు వార్తలు రాయడం మొదలుపెట్టారు. నచ్చిన అమ్మాయి దొరికింది అంటే ప్రేమలో పడినట్టే కదా ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలని అంటున్నారు ఆడియెన్స్. మొత్తానికి రౌడీ హీరో మనసు గెలిచినా అమ్మాయి ఎవరో చూడాలి.