
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సినిమా కథ ఇప్పటికే లీక్ అవగా పుష్ప నుండి మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ ను అలరిస్తుంది. లేటెస్ట్ గా పుష్ప సినిమాలో 6 నిమిషాల యాక్షన్ సీన్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది. యాక్షన్ ప్యాక్డ్ గా ఆ ఆరు నిమిషాల ఫైట్ సీన్ భారీగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ను తెప్పిస్తున్నారట. సినిమాలో అన్ని ఫైట్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ దిశా పటానిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీతో పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. రంగస్థలంతో ఫామ్ లోకి వచ్చిన సుకుమార్ పుష్పతో మళ్ళీ తన ఖాతాలో భారీ హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు.