నిహారిక డ్యాన్స్ వారేవా..!

నిహారిక డ్యాన్స్ లోనూ వారేవా అనిపించేస్తుంది... అదేంటి మెగా డాటర్ నిహారిక డ్యాన్స్ ఎప్పుడు చేసింది అనేగా మీ డౌట్.. అక్కడకే వస్తున్నా.. గురువారం ఏప్రిల్ 30 ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా నిహారిక తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు స్పెషల్ సర్ ప్రయిజ్ ఇచ్చింది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్ తో డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చింది. డ్యాన్స్ డే సందర్భంగా ఢీ షో ద్వారా పాపులర్ అయినా యష్ మాస్టర్ తో నిహారిక స్టెప్పులేసి అదరగొట్టింది. 

చెలి సినిమాలోని మనోహర సాంగ్ కు మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేసిన నిహారిక ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా వాళ్లతో డ్యాన్స్ కు పోటీ వచ్చేది ఎవరు అనేలా అదరగొట్టింది. నిహారికలో కూడా ఈ రేంజ్ డ్యాన్సర్ ఉందా అనుకుంటూ అందరు అవాక్కయ్యేలా చేసింది అమ్మడు. బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ తో నిహారిక అండ్ యష్ ఇరగదీశారని చెప్పొచ్చు. ప్రస్తుతం నిహారిక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.