'సిసిసి'కి నటుడు రఘుబాబు విరాళం..!

కరోనా ఎఫెక్ట్ తో సినీ కార్మికులకు పనులు లేక నిత్యావసరాలు కూడా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటుచేసి అలాంటి వారిని గుర్తించి వారికి కావాల్సిన నిత్యావసరాలను అందిస్తున్నారు. ఇప్పటికే ఇందులో భాగమయ్యేందుకు చాలామంది స్టార్స్ విరాళాలు అందించారు. సిసిసికి నటుడు రఘుబాబు కూడా విరాళాలు ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు. 

సినీ కార్మికుల కోసం ఏర్పాటుచేసిన సిసిసికి 1 లక్ష విరాళం ప్రకటించిన రఘుబాబు, టివి ఆర్టిస్ట్ యూనియన్ కు 25 వేలు, కాదంబరి కిరణ్ మేము సైతం కు మరో పాతిక వేలు అందించారు. వీరితో పాటుగా ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కు 25 వేళా రూపాయలు సహాయం అందించారు రఘుబాబు. లక్ష 75 వేల రూపాయలు విరాళంగా ప్రకటించి తోటి నటీనటులకు అండగా నిలిచారు రఘుబాబు.